Saturday, December 27, 2025
E-PAPER
Homeఖమ్మంగణేష్ నవరాత్రుల పోస్టర్ ఆవిష్కరణ 

గణేష్ నవరాత్రుల పోస్టర్ ఆవిష్కరణ 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
గణేష్ నవరాత్రుల ఉత్సవ పోస్టర్ ను మంగళవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గండుగులపల్లి లోని తన నివాసం లో ఆవిష్కరించారు. అశ్వారావుపేట బస్టాండ్ సెంటర్ లోని గణేష్ టెంపుల్ వద్ద ఈనెల 27 నుండి తొమ్మిది రోజులు పాటు నిర్వహించబోయే 37 వ గణేష్ నవరాత్రి ఉత్సవాల పోస్టర్,కరపత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. 

ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారుల నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని ఆలయ కమిటీ బాధ్యులు కు ఎమ్మెల్యే జారే సూచించారు.  ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు తోకల హరీష్ గుప్తా,ఆలయ కమిటీ అధ్యక్షులు బాలేపల్లి నాగరాజు, కురిశెట్టి నాగబాబు నాయుడు, చీమకుర్తి జితేంద్ర,పోలేపల్లి రామారావు,గొట్టాపు వెంకట అప్పారావు, సత్యనారాయణ,శెట్టిపల్లి రఘురాం తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -