Friday, September 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅంబర్‌పేట్‌లో గణేషుడికి ఘనంగా పూజ

అంబర్‌పేట్‌లో గణేషుడికి ఘనంగా పూజ

- Advertisement -

పాల్గొన్న వెంకటసాయి వెల్ఫేర్‌ అసోసియేషన్‌
హాజరైన పలు కుటుంబాలు, భక్తులు


నవతెలంగాణ-అంబర్‌పేట్‌
గణపతి నిమజ్జనోత్సవం సమీపిస్తున్నవేళ నగరంలో వినాయక మండపాల వద్ద భక్తుల కోలాహలం, పూజలతో సందడి నెలకొంటున్నది. ఇందులో భాగంగా అంబర్‌పేట్‌లోని జస్వాల్‌ గార్డెన్‌లోనూ వెంకటసాయి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అక్కడి గణేశ్‌ మండపంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజను నిర్వహించారు. గణేషుడుడికి పూలు, పండ్లు, ప్రసాదాలు సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో వేల్ఫేర్‌ అసోసియేషన్‌లోని కుటుంబసభ్యులు, భక్తులు పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో ప్రభాకర్‌చారి, రవీందర్‌ చారి, లావణ్య, లతా, సిద్ధార్థ్‌, ప్రణరు, వర్షిక, కీర్తి, సుశాంత్‌, నరసింహమూర్తి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -