8 మంది నేరస్థులు పట్టుకున్న నిజామాబాద్ డివిజన్ పోలీసులు
పోలీస్ కమీషనర్ సాయి చైతన్య
నవతెలంగాణ – కంఠేశ్వర్
అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య తెలిపారు. ఆదివారం నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ హాల్ లో విలేకరు సమావేశం నిర్వహించారు. ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.గత సంవత్సరం కాలం నుండి నిజామాబాద్ జిల్లా లోని, ఇందలవాయి, ధర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, మెండోరా, ముప్కాల్, మోర్తాడ్, ముగ్పాల్, బోధన్ టౌన్, బోధన్ రూరల్, నవీపేట్, వర్ని, మండలాల్లో ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తూ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసంచేసి అందులోని కాపర్ కాయిల్స్ దొంగలించి పారిపోవడం జరిగింది.
శనివారం 15నవంబర్ 2025 సాయంత్రం 5 గంటలకు ఇందల్వాయి వద్ద అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ దోపిడీ ముఠాని పట్టుకొని 40 కిలోల కాపర్ కాయిల్స్, రూ.5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠా లోని ఏడుగురు సభ్యులలో నుండి ఐదుగురిని శనివారం అరెస్టు చేయగా దొంగలించిన కాపర్ కాయిల్స్ ను కొన్న ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసామన్నారు. వివరాల్లోకి వెళ్తే.. నిందితులు నిజామాబాద్ జిల్లా లోని పై పోలీస్ స్టేషన్ పరిదిలలో 101 ట్రాన్స్ ఫార్మర్ లను పగులగొట్టి అందులో వున్న కాపర్ కాయిల్స్ ను దొంగతనలకు పాల్పడగా 44 కేసులు నమోదు అయినట్లు వివరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలతో నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి, ఆద్వర్యంలో స్పెషల్ టీం లను నియమించి నవంబర్ 15న ఇందలవాయి మండల పరిధిలో గన్నారం వద్ద వాహనాలను తనికి చేస్తుండగా అనుమానం వచ్చి నిందితులను పట్టు కోవడం జరిగిందన్నారు.
మహారాష్ట్ర రాష్ట్రం,అహ్మద్ నగర్ జిల్లా,పోచేదాం తాలూకా కు చెందిన తుంబారె సుధాకర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం,అమీననగర్ సారాయి బాగపత్ జిల్లా కు చెందిన హర్బీర్ శర్మ,సుప్రియా టోవార్స్ గ్రౌండ్ ఫ్లోర్ 15 లేన్ బారడిపేట గుంటూర్ జిల్లా కు చెందిన అలీ మహమ్మద్,బండెవెళ్ళిగండ్ల గ్రామం, దర్శి మండలం, ప్రకాశం జిల్లా, ఆంద్రప్రదేశ్ స్టేట్ కు చెందిన యడాల వెంకటేశ్వర్లు, పెద్దాపురం గ్రామం, మద్దపూర్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన శానపల్లి రవీందర్ @ మాదవ రెడ్డి,మేడ్చల్ కు చెందిన అనిల్(దొరకలేదు),ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వలీ ( దొరకలేదు),సంకలపల్లి గ్రామం, ఇడ్లూర్ పోస్ట్, యాదగిరి జిల్లా కర్ణాటక రాస్ట్రం, ప్రస్తుతం మనోరహాబాద్, మెదక్ (కొనుగోలు చేసిన వ్యక్తి) లింగప్ప,కూరేళ్ల గ్రామం, హుస్నాబాద్ మండలం, సిద్దిపేట జిల్లా, ప్రస్తుతం మేడ్చల్(కొనుగోలు చేసిన వ్యక్తి) గాజుల శ్రీ శైలం,డిఆర్. అంబేద్కర్ కమ్యూనిటి హాల్, రంగానగర్, ముషీరాబాద్ హైదరాబాద్ (కొనుగోలు చేసిన వ్యక్తి) మహమ్మద్ హైదర్ అలీ కేసులో ఏడుగురిలో ఐదుగురిని అరెస్టు చేశామని వారితోపాటు కొనుగోలు చేసిన ముగ్గురుని అరెస్టు చేసి విచారించామన్నారు.
వారి వద్ద నుంచి 40 కేజీల కాపర్ కాయిల్స్, 5 లక్షల 50 వేల నగదు,రెండు స్కూటీ లు, 6 సెల్ ఫోన్ లు స్వాదినం చేసుకొని వారిని అరెస్ట్ చేసి కోర్ట్ ముందు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. కేసును చేదించడంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ముఖ్యపాత్ర పోషించిన డిచ్పల్లి సిఐ వినోద్, ఇందల్వా ఎస్సై సందీప్, డిచ్పల్లి ఎస్సై షరీఫ్, జక్రంపల్లి ఎస్సై మహేష్, సిబ్బంది కిరణ్ గౌడ్, కిషోర్ గౌడ్, ప్రశాంత్, సందీప్, సర్దార్, సుజిత్, నవీన్ లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.




