Tuesday, September 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజావాణిలో గంగపుత్రుల నిరసన

ప్రజావాణిలో గంగపుత్రుల నిరసన

- Advertisement -

చెరువులు, నీటి కుంటలపై తమకే హక్కులు కల్పించాలని డిమాండ్‌
పెట్రోల్‌ డబ్బాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు


నవతెలంగాణ – జగిత్యాల
తమకు న్యాయం చేయాలంటూ జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి మండలం కోనరావుపేట, కొండ్రికర్ల గ్రామానికి చెందిన గంగపుత్రులు పెట్రోల్‌ డబ్బాలతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. కలెక్టరేట్‌ ఆవరణలో వారిని గమనించిన పోలీసులు అడ్డుకుని, పెట్రోల్‌ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, వారిని కలెక్టరేట్‌ కార్యాలయం లోపలికి అనుమతించారు. అంతకు ముందు గంగపుత్రులు మాట్లాడుతూ.. చెరువులు, కుంటలపై హక్కులను గంగపుత్రులకు మాత్రమే కల్పించాలని డిమాండ్‌ చేశారు. ముదిరాజ్‌లకు చెరువులపై హక్కులు కల్పించడం దారుణమని, గత ప్రభుత్వ హయాం నుంచీ తమకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. దాదాపు 30మందికి పైగా గంగపుత్రులు ఉండగా, తమను కాదని ముదిరాజ్‌లకు చెరువులపై సభ్యత్వం కల్పించడం అన్యాయమని అన్నారు. ఈ క్రమంలో పెట్రోల్‌ పోసుకోవడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు పెట్రోల్‌ డబ్బాలను లాక్కున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బైటాయించడంతో వారిని కలెక్టరేట్‌ కార్యాలయం లోపలికి అనుమతించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -