నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మరణానికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ నగరంలో డ్రగ్స్‌ను తరలిస్తున్న మాఫియాను అడ్డుకోవడంలో సౌమ్య చూపించిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి కృష్ణారావు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు.
కన్న బిడ్డను చంపిన హంతకుడు కొండమంగళ బాబూరావును కఠినంగా శిక్షించాలని ఆర్.అరుణజ్యోతి, మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని ముఖేడ్ మండలం కేరూర్‌కు చెందిన ముగ్గురు పిల్లల తండ్రి బాబూరావు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినట్టు తెలిపారు. పోటీకి ఇద్దరు పిల్లలను మించి ఉండరాదనే నిబంధనకు అడ్డుగా ఉందనీ, ఆరేండ్ల కూతురిని కాలువలోకి తోసి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబూరావుకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారనీ, ఆడపిల్లపై ఎంతటి వివక్షత ఉందో దీంతో తెలుస్తుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీకి పిల్లల నిబంధనను తొలగించాలని వారు కోరారు.
గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలి : ఐద్వా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



