నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో గణపతి నిమజ్జన ఉత్సవాలు ఐదు రోజులకే నిమజ్జన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పడంపల్లి, నాగల్ గావ్, జుక్కల్, కత్తల్ వాడి, దోస్పల్లి, చిన్నగుల్లా, గుంటూరు, సోపూర్, కౌలాస్ గ్రామాలలో గణపతి నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వాహన చేశారు. గ్రామాలలో గ్రామ పెద్దలు నిమజ్జన ఉత్సవాలలో పాల్గొని నిర్వాహకులకు విషయాన్ని నిర్దేశం చేస్తూ గ్రామ పెద్దలు ముందుండి శాంతి వాతావరణంలో ఊరేగింపుగా భజనలు, కీర్తనలు, మహిళలు కోలాటాలు ఆడుతూ, ఆట , పాటలతో సంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నిమజ్జనానికి గ్రామాలలో వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువెళ్లడం జరిగింది. ప్రతి ఏటా 11 రోజులకు నిమజ్జన కార్యక్రమం చేపట్టాల్సి ఉండగా 11 రోజులకు గ్రహణం ఏర్పడుతున్న క్రమంలో చివరి రోజు 5వ రోజులకే నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్లను చేసుకున్నారు. ప్రత్యేక ప్రసాదాలను ఏర్పాటు చేసి గ్రామస్తులకు వితరణ చేశారు.
ఐదు రోజులకే పలు గ్రామాలలో గణపతి నిమర్జనాలు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES