మహిళల ప్రీమియర్ లీగ్ 2026
ముంబయి : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆష్లె గార్డ్‌నర్ 2026 మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. డబ్ల్యూపీఎల్‌లో 25 మ్యాచ్‌లు ఆడిన ఆష్లె గార్డ్‌నర్ 141.75 స్ట్రయిక్‌రేట్‌తో 567 పరుగులు చేసింది. ఇందులో ఐదు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది వేలానికి ముందు రూ.3.5 కోట్లతో గార్డ్‌నర్‌ను జెయింట్స్ అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ నుంచి జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గార్డ్‌నర్.. గత సీజన్లో గుజరాత్ జెయింట్స్ మూడో స్థానంలో నిలువటంలో కీలక పాత్ర పోషించింది. మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను మూడుసార్లు నెగ్గిన ఆష్లె గార్డ్‌నర్ కెప్టెన్‌గా జెయింట్స్ రాత మారుస్తుందని ప్రాంఛైజీ యాజమాన్యం బలంగా విశ్వసిస్తోంది. డబ్ల్యూపీఎల్ నాల్గో సీజన్ నవీ ముంబయి, వడోదరలో రెండు అంచెల్లో జరుగనుండగా.. జనవరి 10న గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ ఆరంభ మ్యాచ్‌లో తలపడుతాయి.
ఆ ఇద్దరు దూరం : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్లు ఎలిసీ పెర్రీ, అనాబెల్ సుథర్‌లాండ్‌లు 2026 డబ్ల్యూపీఎల్ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌లో ఆడలేమని ఆసీస్ అమ్మాయిలు ప్రాంఛైజీలకు తెలిపినట్టు సమాచారం. సుథర్‌లాండ్ స్థానంలో మరో ఆసీస్ లెగ్ స్పిన్నర్ అలాన కింగ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకోగా.. పెర్రీ స్థానంలో భారత పేసర్ సయాలి సత్‌గారెను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది.
జెయింట్స్ కెప్టెన్‌గా గార్డ్‌నర్
- Advertisement -
- Advertisement -



