నవతెలంగాణ – హైదరాబాద్
ఎన్నో అన్నమయ్య కీర్తనలకు స్వరకల్పన చేసి తన జీవితాన్ని ఆ శ్రీవారికే అంకితం చేసిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ జయంత్యుత్సవాన్ని జంటనగరాల్లోని ప్రముఖ సంగీత శిక్షణాలయాల గురువులు, శిష్యులు శిల్పారామంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అన్నమయ్య పదవిశ్లేషకులు గంధం శంకరరావు, ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, సంగీత దర్శకులు నిహాల్ కొండూరి, ప్రముఖ చిత్రకారులు కూచి సాయిశంకర్, చిలుకూరి ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్‌లు హాజరయ్యారు. కార్యక్రమంలో గురుప్రసాద్ కీబోర్డ్, జయకుమార్ ఆచార్య తబలా సహకారం అందించగా, మహీధర సీతారామశర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేసారు.
ఈ సందర్భంగా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ స్వరపరిచిన అన్నమయ్య పాటలను, ఆయన స్వరపరిచిన లలిత గీతాలను నిహాల్ కొండూరి ‘మాతంగి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’, జయశ్రీ ప్రఖ్యా ‘ప్రఖ్యా ఆర్ట్స్’, సునీతా బాలాజీ ‘స్వరబడి’, వేణు శ్రీరంగం ‘శ్రీరంగం అకాడమీ అఫ్ ఆర్ట్స్’, ప్రతిమ శశిధర్ ‘సరస్వతి సంగీత నత్య శిక్షణాలయం’, విద్యా భారతి ‘స్వరరాజ భారతి’ తదితర విద్యార్థులు పాడి ఆహుతులను అలరించారు. అనంతరం జంటనగరాల్లోని ప్రముఖ గాయనీగాయకులు అన్నమయ్య సంకీర్తన బృందగానంతో ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ఓలలాడించారు. అన్నమయ్య సంగీత, సాహిత్యాలను ప్రజలకు చేరువ చెయ్యడానికి తితిదే అన్నమయ్య ప్రాజెక్ట్ ద్వారా బాలకృష్ణ ప్రసాద్ చేసిన కషిని కొనియాడారు. ఆయనను అపర అన్నమయ్య అని ఆయన్ను స్మరించుకున్నారు.
ఘనంగా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ జయంత్యుత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



