నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో ముస్లిం సోదరులు గ్యార్మీ పండుగ ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దర్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ గ్యార్మీ పండుగను హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా జరుపుకున్నారు. దర్గా వద్ద అన్నదాన నిర్వహించారు.ఐక్యమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండుగ పలువురు అన్నారు. . గ్యార్మీ పండుగను పురస్కరించుకుని ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించారు.
ప్రతి ఏటా గ్యార్మీ పండుగను ఎంతో సంతోషంగా, భక్తి శ్రద్దలతో జరుపుకుంటారని అన్నారు.ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త సూచించిన మార్గంలో నడుచుకోవాలని, ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నారు.వివిధ పార్టీల నాయకులు బృంగి ఆనంద్ కుమార్,దేశం వెంకట్ రెడ్డి, కాయితీ విజయ్ కుమార్ రెడ్డి,వట్టేపు కృష్ణయ్య,తలసాని లక్ష్మారెడ్డి,నిజామోద్దీన్,తలసాని కృష్ణారెడ్డి,కడల మల్లేష్,సుధాకర్ రెడ్డి,యడ్మ శేషి రెడ్డి,కంకల శ్రీశైలం, దున్న భాస్కర్,తాండ్ర తిరుపతి,కమిటీ అధ్యక్షులు ఖాజమైనుద్దీన్, తాజుద్దీన్, నజీరోదీన్,ఖాదర్, నిజామోద్దీన్, గౌసుద్దీన్, షరీఫ్, సలీం,సికిందర్,పాండు,పోలే రవి, ఫక్రుద్దీన్,ప్రేమ్ కుమార్,రాజు,రాములు,తదితరులు పాల్గొన్నారు.