Wednesday, March 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగ్యాస్‌ సిలిండర్‌ ధరను వెంటనే తగ్గించాలి

గ్యాస్‌ సిలిండర్‌ ధరను వెంటనే తగ్గించాలి

- Advertisement -

– ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë
– సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన
నవతెలంగాణ-సూర్యాపేట

అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్‌ యుద్ధంతో చమురు కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ ధర రూ.60కి పెంచిందని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë డిమాండ్‌ చేశారు. ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు లకిë మాట్లాడుతూ.. వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ల ధర రూ.116 పెరిగిందని, చమురు నిల్వలు తగ్గినా, ఇరాన్‌ నుంచి చమురు దిగుమతికి ఆటంకాలు ఇలాగే కొనసాగితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అగ్గిపుల్ల లేకుండానే మండిపోతాయన్నారు. అమెరికాకు తలొగ్గి రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేసిన పర్యవసాన ఫలితమిదని వివరించారు. దీని మూలంగా పేద, మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే అనేక నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారని, మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా గ్యాస్‌ బండ భారం మోపటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యి వైపుకు వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాల్సిన మోడీ ప్రభుత్వం ఆయిల్‌ కంపెనీల లాభాల కోసం ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. పెంచిన గ్యాస్‌ ధరలను తగ్గించే వరకు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు తంగెళ్ల వెంకట్‌చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి, కోశాధికారి మేకనబోయిన సైదమ్మ, సీఐటీయూ శ్రామిక మహిళా కన్వీనర్‌ చెరుకు ఏకలక్ష్మీ, రైతుసంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొప్పుల రజిత, అంగన్వాడీ టీచర్‌ భాస్కరమ్మ, జిల్లా ఆఫీస్‌ బేరర్‌ షేక్‌ ఖాజాబీ, జిల్లా కమిటీ సభ్యులు పిండిగా నాగమణి, గోలి భాగ్యమ్మ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -