Thursday, October 2, 2025
E-PAPER
Homeజాతీయంపండుగ వేళ గ్యాస్‌ బాదుడు

పండుగ వేళ గ్యాస్‌ బాదుడు

- Advertisement -

వినియోగదారులకు మోడీ సర్కార్‌ షాక్‌
న్యూఢిల్లీ: పండుగవేళ వినియోగదారులకు మోడీ సర్కారు షాక్‌ ఇచ్చింది. కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ కొత్త ధరలు అక్టోబర్‌ 1వ తేదీ నుంచే అమలులోకి వచ్చాయి. అయితే హౌటల్స్‌, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.15.50 మేర పెంచుతున్నట్టు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వెల్లడించాయి. అయితే గృహ అవసరాల కోసం వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేపట్టలేదని పేర్కొన్నాయి.

గత సెప్టెంబర్‌లో రూ.51.50 మేర తగ్గి రూ. 1,580 తగ్గింది. అయితే తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో ఈ వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1, 595.50కు చేరుకుంది. అలాగే ముంబయిలో రూ.15.0 పెరిగి రూ.1,547కు చేరింది. ఇక కోల్‌కతా, చెన్నైల్లో రూ.16 మేర పెరిగి ఎల్‌పీజీ ధరలు వరుసగా రూ.1,700, రూ.1,754కు పెరిగినట్టు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) పేర్కొంది. ఈ వాణిజ్య సిలిండర్లను హౌటళ్లలోనే ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ధరల పెరగుదల వల్ల దేశ రాజధాని అంతటా చిరు వ్యాపారులపై భారం పడనుంది. వారు తమ రోజూవారి పనుల కోసం (చిన్న దుకాణాలు, హౌటళ్లు, వ్యాపారాలు) సిలిండర్‌ల పైనే ఎక్కువగా ఆధారపడతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -