– చెలరేగిన మంటలు.. ఇద్దరు మృతి
– నలుగురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం
– మృతుల్లో నాయనమ్మ, మనవడు
నవతెలంగాణ-తల్లాడ
గ్యాస్ సిలిండర్‌కు రెగ్యులేటర్ అమరుస్తుండగా గ్యాస్ లీకై, మంటలు వ్యాపించి ఇద్దరు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుత్తికొండ వినోద్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో వినోద్‌తోపాటు ఆయన తల్లి సుశీల(70), ఇద్దరు కుమారులు తరుణ్(8), వరుణ్, అతని చెల్లెలు కుమార్తెలు ప్రిన్సీ, లింసీ ఇద్దరూ వేసవి సెలవులకు మేనమామ ఇంటికి వచ్చారు. సోమవారం రాత్రి ఇంట్లో సిలిండర్‌కు రెగ్యులేటర్ అమరుస్తుండగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. ఇంట్లో ఉన్న దుస్తులకు మంటలంటుకుని పొగ కమ్మేసింది. దాంతో ఇంట్లో ఉన్న వారికీ మంటలంటుకున్నాయి. వీరిని స్థానికులు 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సుశీల, తరుణ్ మృతిచెందారు. మిగతా వారు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సిలిండర్‌కు రెగ్యులేటర్ పెడుతుండగా గ్యాస్ లీక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES