Tuesday, March 31, 2026
E-PAPER
Homeజాతీయంగ్యాస్‌ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి

గ్యాస్‌ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి

- Advertisement -

సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్‌
న్యూఢిల్లీ : వంటగ్యాస్‌ ధరల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. గృహావసరాల, వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల రెండింతలు ధరలను భారీగా పెంచడాన్ని ఈ ప్రకటనలో పొలిట్‌బ్యూరో తీవ్రంగా వ్యతిరేకించింది. ఉజ్వల పథకం లబ్ధిదారులను కూడా విడిచిపెట్టకుండా గృహావసరాల గ్యాస్‌ వినియోగ దారులపై రూ. 60 పెంపు క్రూరమైనదని విమర్శించింది. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరపై పెంచిన రూ. 114.50 పెంపు కూడా చివరికి వినియోగదా రులపై పడుతుందని పేర్కొంది. ఇప్పటికే నిరంతర ధరల పెరుగుదల, క్షీణిస్తున్న వాస్తవ ఆదాయాలతో కుంగిపోతున్న మధ్యతరగతి, శ్రామిక ప్రజలపై ఈ పెంపులు మరింత భారాన్ని మోపుతాయని విమర్శించింది. సిలిండర్లపై పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి ప్రభుత్వం నిరాకరించడం దాని ప్రజా వ్యతిరేక స్వభావాన్ని బహిర్గతం చేస్తుందని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. పశ్చిమాసియా వివాదం ఈ గ్యాస్‌ ధరల పెంపునకు కారణమమని మోడీ ప్రభుత్వం సమర్థించుకోవడం దాని స్వయంకృత అపరాధాన్ని కప్పిపుచ్చుకోవడానికి క్రూరమైన ప్రయత్నం తప్ప మరొకటి కాదని పొలిట్‌బ్యూరో విమర్శించింది. నిజానికి ఇది ట్రంప్‌ ప్రభుత్వ యుద్ధోన్మాద విధానాల ముందు మోడీ ప్రభుత్వం లొంగిపోవడం, దేశ ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తూ అమెరికా ప్రపంచ ఆధిపత్య ప్రయోజనాలకు సేవ చేయడానికి మోడీ ప్రభుత్వ సంసిద్ధతను ప్రతిబింబిస్తుందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఈ ధరల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఈ ప్రకటనలో పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -