Tuesday, March 10, 2026
E-PAPER
Homeజాతీయంవంటింట్లో గ్యాస్‌ కటకట

వంటింట్లో గ్యాస్‌ కటకట

- Advertisement -

– తగ్గిన సరఫరా
– కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా బంద్‌..
– హోటల్‌ రంగంలో సంక్షోభం
న్యూఢిల్లీ :
పశ్చిమాసియాలో అమెరికా సృష్టించిన అమానుష యుద్ధం నేరుగా సామాన్యుడి వంటింటిపై ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమవడంతో దేశంలో వంటగ్యాస్‌ కొరత తీవ్రమవుతోంది. అనేక ప్రధాన నగరాల్లో గ్యాస్‌ డెలివరీలు ఆలస్యం అవుతోన్నాయి. దేశంలో 30 రోజులకు మాత్రమే సరిపడ మాత్రమే గ్యాస్‌ నిల్వలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొనడంతో సరఫరా నిలిచిపోతుందనే భయంతో వినియోగదారులు సోమవారం ఉదయం నుంచే గ్యాస్‌ ఏజెన్సీల వద్ద బారులు తీరారు. ప్రస్తుతం రీఫిల్‌ బుక్‌ చేసిన తర్వాత డెలివరీ కోసం ఎనిమిది రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు.

కమర్షియల్‌ గ్యాస్‌ నిలిపివేత..
ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పలు నగరాల్లో ఆదివారం నుంచి కమర్షియల్‌ సిలిండర్ల సరఫరాను డీలర్లు పూర్తిగా నిలిపివేయడంతో హోటల్‌ యజమానులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వాణిజ్య సిలిండర్లు దొరక్కపోవడంతో కొందరు గృహ సిలిండర్లను బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తోన్నారు. మరోవైపు ఆదివారం నుంచి కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.115, డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ. 60 చొప్పున పెరిగింది. ఇది ప్రజలపై మరింత పెంచింది.

25 రోజుల తర్వాతే సిలిండర్‌ బుకింగ్‌..
దేశంలో నెలకొన్న గ్యాస్‌ కొరతతో ఇకపై సిలిండర్‌ తీసుకున్న 25 రోజుల తర్వాతే తదుపరి రీఫిల్‌ బుక్‌ చేసుకునేలా కేంద్రం నిర్ణయం ప్రకటించింది. గతంలో ఉన్న 21 రోజుల గడువును పెంచడం ద్వారా ప్రభుత్వం బుకింగ్‌లను నియంత్రిస్తుంది. గ్యాస్‌ నిల్వలు ఫుల్‌గా ఉన్నాయని చెబుతోన్న కేంద్రం మరోవైపు సిలిండర్‌ బుకింగ్‌ గడువు సమయాన్ని పెంచడం వినియోగదారులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -