Sunday, March 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఏప్రిల్‌ 1 నుంచి గ్యాసోలిన్‌ బంద్‌

ఏప్రిల్‌ 1 నుంచి గ్యాసోలిన్‌ బంద్‌

- Advertisement -

– ఎగుమతులపై రష్యా నిషేధం
మాస్కో :
ఏప్రిల్‌ 1 నుంచి గ్యాసోలిన్‌ ఎగుమతులను రష్యా నిషేధించనుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇంధన మంత్రిత్వ శాఖను రష్యా డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్‌ నొవాక్‌ ఆదేశించారు. జులై 31వరకు ఈ నిషేధం అమల్లో వుంటుందని ప్రభుత్వ వార్తా సంస్థ టాస్‌ ఇంతకుముందు తెలిపింది. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా అంతర్జాతీయ చమురు, చమురు ఉత్పత్తుల మార్కెట్‌ తీవ్ర సంక్షోభంలో పడ్డాయని నొవాక్‌ తెలిపారు. దీనివల్ల ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులు వుంటున్నాయన్నారు. అదే సమయంలో రష్యన్‌ ఇంధన వనరులకు విదేశీ మార్కెట్లలో అధిక డిమాండ్‌ ఏర్పడడం సానుకూలమైన అంశమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ముడి చమురు శుద్ధి పరిమాణం గతేడాది స్థాయిలోనే వుందని, అందువల్ల చమురు ఉత్పత్తుల సరఫరా స్థిరంగానే వుంటుందని రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. రష్యన్‌ చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్‌ దాడులు ఉధృతం చేయడం, పైగా ఇంధన డిమాండ్‌ పెరగడంతో గతేడాది రష్యాలో పలు ప్రాంతాల్లో, రష్యా నియంత్రణలోని ఉక్రెయిన్‌లో కొన్ని ప్రాంతాల్లో గ్యాసోలిన్‌ కొరత ఏర్పడినట్టు వార్తలు వచ్చాయి. పెరుగుతున్న ఇంధన ధరలకు కళ్ళెం వేసేందుకు, అలాగే కొరతను ఎదుర్కొనేందుకు గ్యాసోలిన్‌, డీజిల్‌ ఎగుమతులపై రష్యా పదే పదే ఆంక్షలు విధిస్తూ వుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -