Monday, October 27, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గాయత్రి మైన్స్ కంపెనీ తనిఖీ..   

గాయత్రి మైన్స్ కంపెనీ తనిఖీ..   

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
నియోజక వర్గ కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ స్థలం అయిన గుట్టపై గాయత్రి కంపెనీ నిర్వహింస్తున్న మైన్స్ (తెల్లరాళ్లు) తీస్తున్నప్రదేశంను సోమవారం ఆర్ ఐ నారాయణరావు పటేల్ పరిశీలించారు. గుట్టపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నా చోట సంబదిత కంపెనీ వారు ప్రమాదసూచిక బోర్డులు ఏర్పాటు చేయటం లేదని  ఆర్ఐ తెలిపారు..సంబంధిత కంపెనీ కీ ప్రభుత్వం గతంలో  గుట్టను లీజుకు   ఇచ్చింది . దీంతో ఈ మైనింగ్ తరలిస్తుంది. అయితే గత కొన్ని ఏళ్ల నుండి మైన్స్ తరలించి నప్పటికీ పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వర్షం నీరు నీల్వ ఉన్నప్పటికి వాటి వద్ద సూచిక బోర్డులు  ఏర్పాటు చేయకపోవడంతో, ప్రమాద సంభవించే అవకాశం ఉందని పలువురు రైతులు పలుమార్లు  రెవెన్యూ అధికారు లకు విన్నవించారు. ఈ  విషయాన్ని సంబందిత కంపెనీప్రతినిధులకు తెలియజేసిన  పట్టించు కోకపోవటంతో  ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తాజాగా నివేదించినట్లు ఆర్ఐ పేర్కొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -