Wednesday, May 14, 2025
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు గాయత్రి ఎంపిక..

రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు గాయత్రి ఎంపిక..

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని గాయత్రి రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. మధుపాల్ మంగళవారం తెలిపారు. తిర్మన్ పల్లి  ఉన్నత పాఠశాలలో జరిగిన అండర్ 16 నెట్ బాల్ రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో విద్యార్థిని గాయత్రి అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయినట్లు ప్రధానోపాధ్యాయులు బి. మధుపాల్ తెలిపారు. ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు వరంగల్ జిల్లా జనగామ లో జరిగే రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలలో పాల్గొననునట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికవ్వాలని  ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైన గాయత్రి, శిక్షణనిచ్చిన ఫిజికల్ డైరెక్టర్  రమేష్ గౌడ్ లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -