Tuesday, July 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబడికి దూరంగా గాజా చిన్నారులు

బడికి దూరంగా గాజా చిన్నారులు

- Advertisement -

6.50 లక్షల మందికి పైగా పిల్లలకు విద్య అందని వైనం
ఇజ్రాయిల్‌ యుద్ధ ఫలితం : యూనిసెఫ్‌
గాజా :
ఇజ్రాయిల్‌ యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత గాజాలోని లక్షలాది మంది చిన్నారులు చదువుకు నోచుకోలేకపోతున్నారు. 6.50 లక్షల మందికి పైగా పిల్లలు స్కూల్‌కు దూరమయ్యారు. ది యునైటెడ్‌ నేషన్స్‌ చిల్డ్రన్స్‌ ఫండ్‌(యూనిసెఫ్‌) ఈ విషయాన్ని వెల్లడించింది. యునిసెఫ్‌ సమాచారం ప్రకారం.. 2023, అక్టోబర్‌లో గాజాపై ఇజ్రాయిల్‌ దాడులకు దిగిన విషయం విదితమే. ఆ తర్వాత గాజాలో కఠినమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. లక్షలాది మంది చిన్నారులకు విద్య అందటం నిలిచిపోయింది. పైగా ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదానికి ఇక్కడి స్కూళ్లు ఆశ్రయాలుగా మారాయి. ఇవి నిరాశ్రయులైన లక్షలాది మంది ప్రజలతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇజ్రాయిల్‌ ఉన్మాద చర్యల కారణంగా ఇక్కడి పిల్లలు తినటానికి తిండికి కూడా నోచుకోలేకపోతున్నారు. పాఠశాల విద్యను పూర్తి చేసిన వేలాది మంది కాలేజీ చదువును పూర్తి చేయలేని పరిస్థితులు గాజాలో కనిపిస్తున్నాయి. షెల్టర్లు, క్యాంపుల్లో తలదాచుకుంటున్న అనేక మంది చిన్నారులు.. ఆహారం, నీరు కోసం వెతుక్కోవాల్సిన దారుణం పరిస్థితులు గాజాలో ఉన్నాయి. తన యుద్ధోన్మాద చర్యలతో వేలాది మందిని పొట్టనబెట్టుకున్న ఇజ్రాయిల్‌.. ఇప్పటికీ గాజాపై అదే తంతును కొనసాగిస్తున్నది. ఫలితంగా 90 శాతం జనాభా తమ నివాస ప్రాంతాలను వీడి సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాల్సిన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -