Saturday, September 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంత్వరలోనే గాజాపై ఒప్పందం: ట్రంప్‌

త్వరలోనే గాజాపై ఒప్పందం: ట్రంప్‌

- Advertisement -

గాజా: యుద్ధాన్ని త్వరలోనే ముగించి, బందీలను తిరిగి వెనక్కి తీసుకువస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం త్వరలోనే పూర్తి కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లోని రైడర్‌ కప్‌ గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు బయలుదేరే ముందు వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. అయితే, ఒప్పందం పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు.”గాజాపై ఒప్పందం కుదిరేలా కనిపిస్తోంది. బందీలను తిరిగి తీసుకువచ్చే ఒప్పందం అది. ఇది యుద్ధాన్ని ముగించే ఒప్పందం అవుతుంది” అని డోనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఐరాస సమావేశాలు జరుగుతున్న వేళ.. పశ్చిమాసియాలో శాంతిస్థాపన కోసం అమెరికా 21-పాయింట్లతో ఓ ప్రతిపాదిత ప్రణాళిక రూపొందించింది. దీన్ని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్‌, ఈజిప్టు, జోర్డాన్‌, తుర్కియే, ఇండోనేసియా, పాకిస్తాన్‌ దేశాల అధికారులకు పంపించినట్టు అమెరికా వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే గాజా ఒప్పందంపై ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -