Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళావేదిక మహిళా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా గజం ఉమాసత్య

కళావేదిక మహిళా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా గజం ఉమాసత్య

- Advertisement -

నవతెలంగాణ- రామన్నపేట
అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన కవయిత్రి గజం ఉమా సత్య ను నియమిస్తూ ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కత్తిమండ ప్రతాప్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గజం ఉమాసత్య అనేక కవిత రచనలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించడంతోపాటు “మనోచైతన్యం” అనే పుస్తకాన్ని రచించారు.
ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీశ్రీ కళావేదిక తెలుగు భాష, సంస్కృతి, వైభవము, తెలుగు సాహిత్యం, తెలుగు కలల అభివృద్ధిపై కృషి చేస్తుందన్నారు.

36 ప్రపంచ రికార్డులను ఈ సంస్థ సాధించిందని, నిరంతరం సాహితీ కార్యక్రమాలతో ప్రపంచంలోని అతి పెద్ద సాహితీ సంస్థగా ఎదిగిందన్నారు. 15వేల మంది సభ్యులతో 9 దేశాలలో విస్తరించి ఉందని ఆమె తెలిపారు. ఇలాంటి సాహితీ సంస్థకు రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నన్ను నియమించడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు భాష సంస్కృతి, సాహితీ బలోపేతానికి కృషి చేస్తానని ఆమె సందర్భంగా తెలిపారు. నా నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎంపికైన సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -