Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంగాజా ఆక్రమణ వద్దంటూ నిరసనల హోరు

గాజా ఆక్రమణ వద్దంటూ నిరసనల హోరు

- Advertisement -

నెతన్యాహు నిర్ణయాన్ని
వ్యతిరేకిస్తున్న ఇజ్రాయిల్‌ ప్రజలు
యుద్ధాన్ని ఆపి, బందీలను విడిపించాలని డిమాండ్‌
టెల్‌ అవీవ్‌ :
ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు గాజాను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్వతిరేకిస్తు వేలాది మంది ప్రజలు టెల్‌ అవీవ్‌ వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. నగర ప్రదాన రహదారైన అయలోన్‌ హైవేను ద్రిగ్బందించారు. దేశ జెండాలను ప్రదర్శిస్తు, రోడ్డుపై మంటలు రాజేసి ” చాలు యుద్ధాన్ని ఆపండి, బందీలను విడిపించండి ” అని నినదించారు.. ప్రభుత్వానికి వ్వతిరేకంగా జెరుసలెం, హైఫా, బీట్‌షీన్‌, నహారియా, కిర్యత్‌ గాట్‌, రాన్నా, గోమె జంక్షన్‌, నెవె ఇలాన్‌, కార్మియల్‌, మరికొన్ని ప్రాంతాలకు నిరసనలు విస్తరించాయి. హాస్టేజ్‌ స్క్వేర్‌ ప్రాంతంలో జరిగిన నిరసనలో హమాస్‌ చెరలో ఉన్న బందీల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రకటనతో వారి ప్రాణాలకు హాని కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దం తక్షణమే ఆపి హమాస్‌తో ఒప్పందం చేసుకుని బందీలను విడిపించాలని వారు కోరారు.. ఇజ్రాయిల్‌ మీడియా కథనాల ప్రకారం టెల్‌ అవీవ్‌ నిరసనల్లో సుమారు లక్ష మంది పాల్గోన్నారు. గాజాపై దాడులు ప్రారంభమైన తరువాత ఇదే పెద్ద ఆందోళన. అంతర్జాతీయంగా అనేక దేశాలు పాలస్తీనాకు మద్దతుగా నిలిచాయి. ఇటీవలే యూకె. ఫ్రాన్స్‌, కెనడాలు పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని ప్రకటించాయి.
అగష్టు 17న సమ్మె
గాజా ఆక్రమణకు వ్వతిరేకంగా భాదిత, సైనికుల కుటుంబాలు, అక్టోబర్‌ కౌన్సిల్‌ సభ్యులు ఆగష్టు 17న సమ్మెకు పిలుపునిచ్చారు. టెల్‌ అవీవ్‌లోని కిర్యా సైనిక స్థావరం వద్ద జరిగిన పత్రికా సమావేశంలో వారు సమ్మెను ప్రకటించారు..గాజా స్వాదీన ప్రకటన బందీలను మరింత ప్రమాదంలో పడేస్తుందని, అనేకమంది సైనికులు ప్రాణాలు కోల్పోతారని, గాజాలో మానవతా సంక్షోభం మరింత పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆగష్టు 17 ఆదివారం నాడు సమ్మెలో అందరూ పాల్గోవాలని, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, కార్మికులు, ఇతర శ్రామికులు పనిని బహిష్కరించాలని వారు కోరారు. ఈ సమ్మెకు వామపక్ష, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.
గాజాపై ఇజ్రాయిల్‌ నరమేధం ఆపాలని
ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు

గాజాపై ఇజ్రాయిల్‌ మారణ హోమాన్ని నిరసిస్తూ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా అనేక మంది ప్రదర్శనలు చేశారు. ఇజ్రాయిల్‌ విధించిన ఆంక్షలతో ఆకలి మరణాలు సంభవిస్తున్నాయని, శరణార్థులతో పాటు అమాయకుల బాంబు దాడులతో తెగబడుతున్న తీరుపై ప్రదర్శనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.లండన్‌లో, పాలస్తీనా యాక్షన్‌ సమూహాన్ని నిషేధించాలనే బ్రిటిష్‌ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శనివారం జరిగిన నిరసనలో 466 మందికి పైగా అరెస్టు చేసినట్టు మెట్రోపాలిటన్‌ పోలీసులు తెలిపారు..
టర్కి దేశం ఇస్తాంబుల్‌లో.. వేలాది మంది నిరసనకారులు గాజా స్ట్రిప్‌లోకి మరింత సహాయాన్ని అనుమతించాలని డిమాండ్‌ చేశారు. మానవతా సంక్షోభాన్ని అంతం చేయడానికి అంతర్జాతీయ సమాజం అత్యవసర చర్య తీసుకోవాలని కోరారు. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో, స్సెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌, స్విట్టర్లాండ్‌లోని జెనీవాలోనూ, మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో కూడా గాజాలో బాధపడుతున్న వారికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. గాజాకు తక్షణ సహాయం అందించాలని, యుద్ధాన్ని ముగించాలని వారు డిమాండ్‌ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img