రఘుకుంచే టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా అనేది ట్యాగ్‌లైన్. రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి స్పందనని రాబట్టుకున్నాయి. మొదటగా ఈ చిత్రాన్ని ఈనెల 17న విడుదల చేద్దామనుకున్నారు చిత్ర నిర్మాత దర్శకుడు చైతన్య మోటూరి. అయితే అదే రోజు దాదాపు తొమ్మిది సినిమాలు రిలీజ్‌కి సిద్ధమవ్వటంతో సినిమా హక్కులు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు ఈ చిత్రాన్ని మరో వారం రోజుల తర్వాత అంటే ఈనెల 24న సినిమా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలియచేశారు.
ఈ చిత్రం ట్రైలర్‌కి అనూహ్యమైన స్పందన రావటంతో రఘు కుంచే, చైతన్య మోటూరిలు మాట్లాడుతూ, ‘కంటెంట్ ఉన్న సినిమాను పది సినిమాల మధ్యలో విడుదల చేసి ఆ సినిమా అస్థిత్వాన్ని కోల్పోయేలా చేయకూడదు అనే ఒకే ఒక ఉద్ధేశ్యంతో సినిమాను మరుసటి వారానికి వాయిదా వేస్తున్నాం. అలాగే సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ట్రైలర్ చాలా కొత్తగా ఉంది అని ప్రతి ఒక్కరు మరో నలుగురికి చెప్పటంతో ఆర్గానిక్‌గా మా సినిమాకి చక్కని బజ్ ఏర్పడటం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు.
‘గేదెలరాజు’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



