Friday, November 14, 2025
E-PAPER
Homeక్రైమ్ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడు మృతి

ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – ధర్మసాగర్
తాటి చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలో చోటుచేసుకుంది. జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జానకిపురం గ్రామానికి చెందిన మోడం యాదగిరి (46) కల్లుగీత వృత్తి ఆధారంగా జీవన సాగిస్తున్నాడు. వృత్తిలో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్లు తీసేందుకు చెట్టు ఎక్కాడు. దిగే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఈ సందర్భంగా స్థానికులు ప్రజాప్రతినిధులు, గీత కార్మికుల సంఘాల నాయకులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -