Monday, November 24, 2025
E-PAPER
Homeజాతీయంఉత్తరాఖండ్‌లో జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం

ఉత్తరాఖండ్‌లో జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం

- Advertisement -

పాఠశాల సమీపంలో భారీగా పేలుడు పదార్థాలు
డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ ఆల్మోర్‌ జిల్లాలోని ఒక పాఠశాల సమీపంలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను గుర్తించినట్టు అల్మోరా పోలీసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హర్యానాలో సుమారు మూడు వేల కేజీల పేలుడు పదార్థాలు దొరికిన కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. దాబ్రా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలోని పొదల్లో అనుమానాస్పద ప్యాకెట్లను శుక్రవారం గుర్తించిన ప్రిన్సిపల్‌ సుభాష్‌ సింగ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు డిస్పోజబుల్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టాయి. పొదల నుంచి 160 జిలెటిన్‌ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారని సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ (ఎస్‌ఎస్‌పీ) దేవేంద్ర పించా తెలిపారు. రోడ్డు నిర్మాణ సమయంలో పేలుడు పదార్థాలను కాంట్రాక్టర్‌ వదిలి వెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని చెప్పారు. పేలుడు పదార్థాల చట్టం 1908లోని సెక్షన్‌ 4(ఎ), బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 288 కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -