నవతెలంగాణ -తాడ్వాయి
మోడీ అమలు చేస్తున్న కార్మిక వర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కార్మిక కర్షక చట్టాలకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో బుధవారం కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక కార్మిక సమ్మె సూపర్ సక్సెస్ అయింది. సిఐటియు అనుబంధ సంఘాల నుంచి వందలాదిమంది కార్మికులు, కర్షకులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, హమాలీ కార్మికులు, తాపీ మేస్త్రి కార్మికులు రోడ్లపైకి వచ్చి మోడీకి వ్యతిరేకంగా నినదించారు.
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ కదం తొక్కారు. మండల కేంద్రంలో కాటాపూర్ క్రాస్ నుండి మేడారం ఆర్చ్ గేట్ వరకు కొనసాగించి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మోడీ పాలనలో కార్మిక కర్షక వర్గం పెను ప్రమాదంలో పడిందని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి, రైతు సంఘం ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, సిఐటియు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కురెందుల సమ్మక్క లు సంయుక్తంగా విమర్శించారు. కార్మికులను కట్టు బానిసలను చేసి కార్పొరేట్లకు ఊడిగం చేయించేలా నాలుగు లేబర్ కోడ్లు ఉన్నాయని ధ్వజమెత్తారు. పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించి, కనీస వేతన చట్టాలను అమలు చేయకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ పాలనకు కార్మికులు ‘ఘోరి’ కడతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ గిరిజన సంఘం నాయకులు అల్లెం అశోక్, ఊకే ప్రభాకర్, దాసరి కృష్ణ అంగన్వాడి యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి సరోజన, రుక్మిణి, సరిత, రేణుక, గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు బండారి బుచ్చిబాబు, పురుషోత్తం, రాజు, ఆనంద్, ఆశా వర్కర్ యూనియన్ నాయకులు మంకిడి రమ, రోజా రాణి, అనిత, కవిత, భువన నిర్మాణ కార్మికులు చిట్టినేని శ్రీనివాస్, కాట నర్సింగరావు పల్నాటి నరసింహులు, పల్నాటి సత్యం తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయిలో సార్వత్రిక కార్మిక సమ్మె సూపర్ సక్సెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES