Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్Vemulawada Market Yard: వేములవాడ మార్కెట్ యార్డులో సాధారణ సమావేశం..

Vemulawada Market Yard: వేములవాడ మార్కెట్ యార్డులో సాధారణ సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ వేములవాడ:

వేములవాడ పట్టణంలోని మార్కెట్ యార్డులో బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రొండి రాజు మాట్లాడుతూ రైతుల సమస్యలు, మార్కెట్ యార్డు అభివృద్ధి, సదుపాయాల విస్తరణపై చర్చ చర్చించినట్లుగా ఆయన తెలిపారు. రైతులకు మద్దతు ధర కల్పన, పారదర్శక సేవలు, యార్డు పరిసరాల్లో శుభ్రత, తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల మెరుగుదలపై నిర్ణయాలు తీసుకున్నట్లుగా వెల్లడించారు. “రైతు ల కోసం మార్కెట్ కమిటీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది, వారి అభివృద్ధే మా ప్రాధాన్యం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు దైత కుమార్, పాలకుర్తి పరశురాం, వస్తాది కృష్ణ ప్రసాద్ గౌడ్, ఖమ్మం గణేష్, షేక్ సాబీర్, చెరుకు శంకర్, కత్తి కనకయ్య, స్రవంతి, మానుపాటి పరశురాం, చీకొట్టి నాగరాజు, విద్యాసాగర్, సల్మాన్ రెడ్డి తోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad