నవతెలంగాణ – కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ వాటర్ వర్కర్స్ కార్మికులతో కలిసి ఈనెల 20న జరిగే సార్వత్రిక సమ్మె ను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోస్టర్ల ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి బాలరాజ్ మాట్లాడుతూ.. సార్వత్రిక సమ్మె భారతదేశం మొత్తంలో కార్మిక వర్గాన్ని కేంద్ర ప్రభుత్వము చిన్నచూపు చూస్తుందని, కార్మికులకు కనీస వేతనాలు సుప్రీంకోర్టు జీవో ప్రకారం స్కిల్ అండ్ అన్ స్కిల్ కార్మికుల కనీస వేతనాలు ఇవ్వాలని, శానిటేషన్ కార్మికులకు సబ్బులు, నూనె, బ్లౌజులు, నిత్యవసర సరుకులు నెలకు సరిపడా కనీస జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని, పిఎఫ్ ఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అనారోగ్యానికి గురవుతే ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఈఎస్ఐ హాస్పిటల్ కామారెడ్డి లో లేనందున కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం, సుప్రీంకోర్టు జీవో 26 వేల వేతనాన్ని ఇవ్వాలని లేనియెడల ఈనెల జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా దేశము రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సమ్మె నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలరాజు, కామారెడ్డి మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు నర్సింగరావు, ఏ రాజు, జి రాజు, ఆర్ లక్ష్మణ్, కే సాయి, నాగరాజు, బి గంగాధర్, జి భాస్కర్, పిట్ల శ్రీనివాస్, రాజు, గౌస్, ఎన్ స్వామి, శేఖర్, సత్యం, సాయిలు, నారాయణ, ఖలీమ్ మొద్దీన్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES