Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్సార్వత్రిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ

సార్వత్రిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -

తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి 
కాటాపూర్ లో పోస్టర్ ఆవిష్కరణ 
నవతెలంగాణ – తాడ్వాయి 
: కార్మికుల హక్కుల రక్షణకై నాలుగు లేబర్‌ కోడ్లు రద్దుకై దేశవ్యాప్తంగా “మే” 20న జరుగు సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి అన్నారు. కాటాపూర్ లో సోమవారం మే 20 జరుగు సార్వత్రిక సమ్మె పోస్టర్ ను సిఐటియు గ్రామ కార్యదర్శి ఎర్రోజు సత్యనారాయణ, చిట్టినేని శ్రీను, ఆటో యూనియన్ మండల అధ్యక్షులు గాంధెర్ల శంకర్ ల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్‌ కోడ్‌ చట్టాలతో ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్‌ కోడ్లు ను అమలు చేయడం దుర్మార్గమన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు. ఆటో, హమాలీ, బిల్డింగ్‌ వంటి అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేసి న్యాయం చేయాలన్నారు. అదేవిధంగా ఆదివాసి హక్కులను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని, అటవీ సంరక్షణ చట్టంతో ఈసా చట్టంలో గ్రామసభను లేకుండా చేసిందని ఈ విధానంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న కన్య సంపద నువ్వు దోచుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. చతిస్గడ్ లో నాలుగు లక్షల 50 వేల ఎకరాల పెట్టుబడిదారీ వర్గానికి అప్పుచేసి ఆపరేషన్ కగారు పేరుతో అక్కడి ఆదివాసీలను వెల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ద్విజమెత్తారు. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి, ఆశా, మిడ్డేమిల్‌, విఒఎ, ఆర్‌పి, శానిటేషన్‌ వర్కర్స్‌ అందర్నీ పర్మినెంట్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రవేటీకరణ అపాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ వంటి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాలకూ చెందిన కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాటాపూర్ భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి ఎర్రోజు సత్యనారాయణ, చిట్టినేని శ్రీను, నామాని శంకర్ ఆటో యూనియన్ అధ్యక్షులు గాంధర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -