నవతెలంగాణ – భువనగిరి: సీబీఎస్ఈ బోర్డు ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో భువనగిరికి చెందిన జీనియస్ హై స్కూల్ చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచి తమ సత్తా చాటారు. పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ బి సూర్యనారాయణ రెడ్డి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాపించిన నాటి నుండి నేటి వరకు అన్ని వసతులతో పాటు నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తూ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తుందన్నారు. జిల్లాలో ప్రథమ స్థానంలో నిలచి రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నామని అన్నారు. ఇట్టి ఫలితాలకు సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే మా యొక్క లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పడాల శ్రీనివాస్, డైరెక్టర్స్ తోట శ్రీధర్, కంఠం నాగేందర్, ప్రిన్సిపల్ బి స్వర్ణలత, ఏవో జి రవి, కే శ్రీకాంత్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.
పదిలో జీనియస్ విద్యార్థుల ప్రభంజనం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES