Wednesday, April 30, 2025
Homeప్రధాన వార్తలునరమేధం ఆపాలి

నరమేధం ఆపాలి

– మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలి
– ఆపరేషన్‌ కగార్‌ నిలిపేయాలి
– కర్రెగుట్టల్లో సాయుధ బలగాలను ఉపసంహరించాలి
– వనరులను కార్పొరేట్లకు అప్పగించొద్దు : కేంద్రానికి వామపక్ష నేతల డిమాండ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలను జరపాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ఆదివాసీ జాతిని హననం చేస్తున్న ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపేయాలని కోరారు. కర్రెగుట్ట ప్రాంతాన్ని సాయుధ బలగాలు మోహరించి నర మేధం సృష్టించడాన్ని తీవ్రంగా ఖండించారు. కర్రెగుట్ట ప్రాంతం నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీలకు, అటవీ ప్రాంతానికి రాజ్యాంగం ఇచ్చిన రక్షణలను, ప్రత్యేక హక్కులకు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం విఘాతం కలిగిస్తున్నదని విమర్శించారు. అక్కడి విలువైన సహజ వనరులు, నిక్షేపాలను బడా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు ఈ యుద్ధాన్ని సాగిస్తున్నదని అన్నారు. ఆదివాసీలను అక్కడి నుంచి వెళ్లగొ ట్టడం కోసమే కగార్‌ యుద్ధాన్ని చేస్తున్నదని వివరించారు. దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైని కులు, సాయుధ బలగాలను దించి హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా దేశ పౌరులను పిట్టల్లా కాల్చుతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి చర్చ లకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రతిపా దించిందని గుర్తు చేశారు. దీనికి కేంద్రం అంగీకరించి శాంతిచర్చలను బేషరతుగా ప్రారం భించాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఫాసిస్టు పంథాలో ముందుకెళ్తున్న కేంద్రం : కూనంనేని
మావోయిస్టులు తప్పు చేస్తే రాజ్యాంగం ప్రకారం కేసులు నమోదు చేసి శిక్షించాలి తప్ప వారిని చంపే హక్కు కేంద్రానికి ఎక్కడిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. చర్చలకు వస్తా మంటూ మావోయిస్టులు ప్రతిపాదిస్తున్నా కేంద్రం యుద్ధ చేయడం ఎంత వరకు సమంజ సమని అడిగారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఫాసిస్టు ధోరణితో వ్యవహరిస్తున్నదని విమర్శిం చారు. 1952లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సమయంలోనూ ఇంత నిర్బంధం లేదన్నారు. 2026, మార్చి నాటికి మావోయిస్టు ల్లేకుండా చేస్తామంటూ కేంద్రం ప్రకటించడంతో పాటు ఫాసిస్టు పంథాలో ముందుకెళ్తున్నారని విమర్శించారు. పరాయి దేశాల మీద యుద్ధం చేసినట్టు సొంత దేశంలోని పౌరులపై కేంద్రం యుద్ధం కొనసాగిస్తున్నదని అన్నారు. మావోయి స్టులను తుదముట్టిస్తామంటూ ప్రతిజ్ఞ చేసి చంపడం దుర్మార్గమన్నారు. దీన్ని న్యాయ స్థానాలు సుమోటోగా స్వీకరించాలని కోరారు. మావోయిస్టులు అడవులను గానీ, అక్కడ ఉన్న సంపదను కానీ స్వాధీనం చేసుకోలేదనీ, అమా యక ప్రజలైన ఆదివాసీల హక్కులు, వారి రక్షణ కోసం పోరాడుతున్నారని అన్నారు. కేంద్రాన్ని ఎవరూ ప్రశ్నించొద్దు, పేదల పక్షాన ఎవరూ మాట్లాడొద్దనే ధోరణితో ఉందన్నారు. ఇది సరైంది కాదని చెప్పారు.
జమ్మూకాశ్మీర్‌లో ఆపరేషన్‌ కగార్‌ చేపట్టాలి : జూలకంటి
కర్రెగుట్ట ప్రాంతంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తూ మావోయిస్టులను హతమారుస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. అక్కడ ఎవరూ ఉండకుండా అందర్నీ చంపేందుకే ఆపరేషన్‌ కగార్‌ను కేంద్రం చేపట్టిందన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు సామాన్యులను పొట్టన బెట్టుకుంటున్నా రని అన్నారు. కేంద్రానికి దమ్ముంటే జమ్మూకాశ్మీర్‌లో ఆపరేషన్‌ కగార్‌ను చేపట్టాలనీ, ఉగ్రవాదులను తుదముట్టించాలని డిమాండ్‌ చేశారు. దాన్ని ప్రజలు హర్షిస్తారని చెప్పారు. కర్రెగుట్ట ప్రాంతంలో ఉండే ఖనిజ సంపద కోసమే ఈ యుద్ధాన్ని చేస్తున్నదని అన్నారు. ఆ సంపదను కొల్లగొట్టొద్దనీ, కార్పొరేట్లకు అప్పగించొద్దని డిమాండ్‌ చేశారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి, ఆ ప్రాంతం అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు. శాంతి చర్చలు జరపాలంటూ ప్రధానికి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ కేంద్ర కమిటీ సభ్యులు కెజి రాంచందర్‌, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ మురహరి, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రాజా, ఫార్వర్డ్‌బ్లాక్‌ రాష్ట్ర నాయకులు ప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా మావోయిస్టులో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. దండకారణ్యంలో నరమేధాన్ని ఆపాలని కోరారు. పేదరికాన్ని, ఆదివాసీల సమస్యలను నిర్మూలించకుండా మావోయిస్టులను చంపడం సరైంది కాదన్నారు. మావోయిస్టులను చంపితే వేరే రూపంలో ప్రభుత్వాలను ప్రశ్నిస్తారని చెప్పారు. మావోయిస్టుల అంతం చూడాలనే ధోరణిని కేంద్రం విడనాడాలనీ, శాంతిచర్చలు జరపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు డిజి నరసింహారావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఐ(ఎంఎల్‌) నాయకులు కె గోవర్ధన్‌, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
మే 2న హైదరాబాద్‌లో సెమినార్‌
కేంద్ర ప్రభుత్వం తక్షణమే కగార్‌ ఆపరేషన్‌ నిలిపేసి మావోయిస్టులతో బేషరతుగా చర్చలు జరపాలంటూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మే2న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో సెమినార్‌ను నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఈ సదస్సులో వామపక్ష పార్టీల నాయకులతోపాటు మేధావులు పాల్గొంటారని వివరించారు. ఈలోపు కేంద్రం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img