Tuesday, July 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజీనోమ్‌ వ్యాలీ తెలంగాణకే గుర్తింపును తీసుకొచ్చింది: సీఎం రేవంత్‌ రెడ్డి

జీనోమ్‌ వ్యాలీ తెలంగాణకే గుర్తింపును తీసుకొచ్చింది: సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : దేశంలోనే వ్యాక్సిన్ ల ఉత్పత్తిలో 33 శాతం కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ లు తయారు చేశామని ఇక్కడి నుంచే ప్రపంచ దేసాలకు వ్యాక్సిన్ లు సరఫరా చేయగలిగామన్నారు. ఇవాళ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ కు భూమిపూజ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జీనోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకే ఒక గుర్తింపును తీసుకువచ్చాయన్నారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమిని సాధించడమే తమ లక్ష్యం అని అందులో భాగంగా తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను ఈ ఏడాది డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నామని చెప్పారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగా పాలసీలు, అనుమతులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ప్రభుత్వాలు మారినా పరిశ్రమల ఏర్పాటుకు పాలసీలు, రాయితీలు, అనుమతలు విషయంలో విధానపరమైన నిర్ణయాలను మెరుగు పరుచుకుంటూ ముందుకు వెళ్లామే తప్ప ఎక్కడా పరిశ్రమలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు లేవన్నారు. మా ప్రభుత్వం మరింత మెరుగైన పారిశ్రామిక విధానాలను తీసుకువచ్చి పెట్టుబడులను ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -