– బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించండి
– ప్రభుత్వం పై ప్రజల అసంతృప్తి కి స్థానిక ఎన్నికలే సాక్ష్యం.
నవతెలంగాణ – అశ్వారావుపేట
వచ్చే మున్సిపాల్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని,నాయకులు సమన్వయంతో పని చేసి మాజీ సీఎం కేసీఆర్ కి బహుమతిగా అశ్వారావుపేట మున్సిపాలిటీ ని గెలిపించి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శుక్రవారం అశ్వారావుపేట లోని సత్య సాయి కళ్యాణ మండపంలో మున్సిపాలిటీ ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామని.సెంట్రల్ లైటింగ్,వంద పడకల ఆసుపత్రి,డయాలసిస్ సెంటర్,ఆర్టీఓ కార్యాలయం, డిగ్రీ కళాశాల వంటి అనేక పనులు, అశ్వారావుపేట ను మున్సిపాలిటీగా చెయ్యాలనీ ప్రజల కోరిక మేరకు నివేదికలు అన్ని అప్పటి మంత్రి కేటీఆర్ సమర్పించడం జరిగిందని, దానికి ఫలితమే ఈరోజు అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పడడం జరిగిందని.మరి మొదటి సారిగా జరిగే ఈ ఎన్నికల్లో గులాబీ జెండా రెప రెపలాడాలని.దానికోసం నాయకులు మరియు కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి పని చెయ్యాలని.
గడిచిన రెండు సంవత్సరాల లో కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవని,పోయకపోగా తాను ఎమ్మెల్యే ఉన్న సమయంలో మంజూరు చేసిన అనేక అభివృద్ధి పనులను సైతం కాసులకు కక్కుర్తి పడి నాణ్యత లేకుండా నిర్మిస్తూ ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని,100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మోసం చేసి నేటి వరకు ఎలాంటి హామీలు అమలు చేయకపోవడాన్ని మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక మనిషికి వివరించాలని ఆన్నారు.చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక జరగాలని అలాగే పలు సూచనలను స్థానిక నాయకత్వానికి సూచించారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జజ్జూరు వెంకన్న బాబు, దమ్మపేట మండల అధ్యక్షులు దొడ్డ రమేష్,మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, నాయకులు యుఎస్ ప్రకాష్ రావు,మందపాటి రాజ మోహన్ రెడ్డి,సంక ప్రసాద్,కాసాని చంద్ర మోహన్,వగ్గెల పూజ, సత్యవరపు సంపూర్ణ, ఫణీంద్ర,గుడవర్తి వెంకటేశ్వరరావు,గోవిందు,నక్క రాంబాబు,తాళం సూరి,వెంకన్న,బజారయ్య లు పాల్గొన్నారు.



