ఏప్రిల్‌లో తదుపరి ప్రక్రియ
18 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలకు ఈసీ ఆదేశాలు
న్యూఢిల్లీ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)కు సంబంధించిన సన్నాహక పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని గురువారం కేంద్ర ఎన్నికల సంఘం 18 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు లేఖ రాసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా, నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్నాటక, లడఖ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఢిల్లీ, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు రాసిన లేఖలో.. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో సర్‌పై గత జూన్‌లోనే ఆదేశించినట్టు పోల్ అథారిటీ తెలిపింది. ప్రస్తుతం బీహార్‌లో సర్ ప్రక్రియ, మరో తొమ్మిది రాష్ట్రాలు, మూడు యూటీలలో కొనసాగుతోంది. ఇక అసోంలో సర్‌కు బదులుగా ప్రత్యేక సవరణ ఫిబ్రవరి 10న పూర్తయినట్టు అధికారులు ప్రకటించారు.



