అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలసదారులపై కఠిన నిబంధనలతో ట్రంప్ బెంబేలెత్తిస్తున్నారు. హెచ్..1 బీ వీసా, గ్రీన్‌కార్డులపై ఆంక్షలు పెట్టిన అమెరికా అధ్యక్షుడు తాజాగా మరో షాక్ ఇచ్చేలా మార్గదర్శకాలు జారీ చేశారని సమాచారం. సమాజంలోని ప్రజల జీవనశైలి మారటంతో డయాబెటిస్, ఒబెసిటీ బారిన పడుతున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
వాషింగ్టన్: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలసదారులపై కఠిన నిబంధనలతో ట్రంప్ బెంబేలెత్తిస్తున్నారు. హెచ్..1 బీ వీసా, గ్రీన్‌కార్డులపై ఆంక్షలు పెట్టిన అమెరికా అధ్యక్షుడు తాజాగా మరో షాక్ ఇచ్చేలా మార్గదర్శకాలు జారీ చేశారని సమాచారం. సమాజంలోని ప్రజల జీవనశైలి మారటంతో డయాబెటిస్, ఒబెసిటీ బారిన పడుతున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి వ్యాధులున్న వారి వీసాలను తిరస్కరించేలా కొత్త నిబంధనలను రూపొందించారు. ఈ మేరకు అమెరికా ఎంబసీలు, కాన్సులర్ కార్యాలయాలకు యూఎస్ విదేశాంగ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఆరోగ్యస్థితిపై ఇమిగ్రేషన్ అధికారుల పరిశీలన
సాధారణంగా అమెరికా వీసాకోసం దరఖాస్తు చేసుకునే వారి ఆరోగ్య స్థితిని ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తారు. టీబీ వంటి అంటు వ్యాధులు ఉన్నాయో లేదో స్క్రీనింగ్ చేస్తారు. అయితే ఈ నిబంధనలను తాజాగా సవరించారు. మరిన్ని వ్యాధులను ఈ జాబితాలో చేరుస్తూ మార్గదర్శకాలు రూపొందించారు. అంటే.. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుల మెడికల్ హిస్టరీపై అధికారులు మరింత నిఘా పెట్టనున్నారు. వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? వారిని అమెరికాలోకి అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుందా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని వీసా జారీపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే అవకాశమున్న దరఖాస్తుదారులను అమెరికాలోకి రానివ్వకుండా వీసాను తిరస్కరించేలా నిబంధనలను కఠినతరం చేసినట్టు సమాచారం. ”దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
హృద్రోగ సమస్యలు, శ్వాస సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిని సంరక్షించాలంటే లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక, ఒబెసిటీ కారణంగా ఆస్తమా, స్లీప్ ఆప్నియా, హై బీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరం. ఆర్థిక భారం కూడా ఎక్కువే. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడుతారో లేదో గుర్తించాలి. ఒకవేళ అలాంటి వారైతే అమెరికాలోకి ప్రవేశాన్ని తిరస్కరించాలి” అని ఆ మార్గదర్శకాల్లో వెల్లడించినట్టు తెలిసింది. అంతేకాదు.. ఒకవేళ వలసదారులు అమెరికా ప్రభుత్వ సాయం లేకుండా వైద్య చికిత్సలను సొంతంగా భరించగలరా లేదా? అన్నది కూడా నిర్థారించుకోవాలని వీసా అధికారులను ఆదేశించారు.
ఇక, కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కూడా పరిశీలించాలని స్పష్టం చేశారు. అయితే, ఈ వార్తలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించలేదు. దీంతో ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పటికే వలసదారులకు సంబంధించి అమెరికా యంత్రాంగం కఠిన విధానాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజీ విజిటర్ల ‘డ్యూరేషన్ ఆఫ్ స్టే’పై పరిమితి విధించడం, హెచ్-1బీ వీసాపై వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలు వలసదారులను ఆందోళనకు గురిచేశాయి.
డయాబెటిస్, ఒబెసిటీ ఉంటే అమెరికా వీసా కష్టమే!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



