- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రకారం దేశంలో హైదరాబాద్ ఆరో ర్యాంకు సాధించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ వెల్లడించారు. ఈ ఏడాదిలో ఏం సాధించామనే విషయాలను వెల్లడించేందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెవెన్ స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ ధ్రువపత్రం కూడా వచ్చిందన్నారు. పారిశుద్ధ్య పనుల్లో మరింత వృద్ధి సాధించాల్సి ఉందని తెలిపారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా నెల రోజులపాటు శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
- Advertisement -



