ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

– సిహెచ్ కరుణాకర్ రావు ఎస్ ఐ పసర
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని
పసరా ఎస్ ఐ సిహెచ్ కరుణాకర్ రావు అన్నారు. మంగళవారం మండలంలోని బాలాజీ నగర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ ఇస్లావత్ మౌలిక వినోద్ నాయక్ ఆధ్వర్యంలో పంచాయతీ గ్రామాల ప్రజలతో మాట్లాడారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాల వల్ల నేరాలను సులభంగా అరికట్టవచ్చని ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో దొంగతనాలను నివారించేందుకు ఎంతగానో సహకరిస్తాయని అన్నారు. దాతల సహకారంతో మరియు గ్రామస్తులు సమిష్టిగా కృషిచేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధం కావాలన్నారు.
బీటి సిసి రహదారులను కాపాడుకోవాలి
వర్షాకాలంలో ట్రాక్టర్ యజమానులు కేజీ వీల్స్ ద్వారా రహదారులను ధ్వంసం చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని  అన్నారు. ప్రభుత్వం లక్షలు కోట్ల రూపాయలను వెచ్చించి రహదారులను నిర్మించి ఇస్తోందని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.
ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిచ్చి మొక్కలు చెత్త మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేసి మురుగునీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని త్రాగునీటికి కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కలుషితమైన నీరు తాగకుండా క్లోరినేషన్ వాటర్ ను తీసుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలన్నారు. హెల్త్ సబ్ సెంటర్ మరియు ఆరోగ్య సమస్యలు తగిలితే వెంటనే వైద్య సిబ్బంది ద్వారా సంబంధిత టాబ్లెట్స్ వాడి నివారించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అల్లం రోజా ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ట్రాక్టర్ యజమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love