– కాటాపూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రంజిత్
– ఘనంగా జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం
నవతెలంగాణ – తాడ్వాయి
డెంగ్యూ వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని, భాగస్వామ్య పద్ధతులు ఉపయోగించడం ద్వారా డెంగ్యూ వ్యాధిని సమూలంగా నిర్మూలించవచ్చని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వేముల రంజిత్ అన్నారు. కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యాధికారి డాక్టర్ రంజిత్, స్థానిక సర్పంచ్ పుల్లూరి గౌరమ్మతో కలిసి మంగళవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. వైద్య అరోగ్య సిబ్బంది భారీగా ర్యాలీలో పాల్గొని అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంగ్యూ నివారణకు తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు వివరించారు. అలాగే వ్యాధి నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలప్తె ఆరోగ్య అవగాహన కల్పించారు. దోమల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. లార్వా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా, మురికి గుంటలు ఏర్పడ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతీ శుక్రవారం ” డ్రైడే-ఫ్రైడే” గా పాటించాలని వైద్యాధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ హెచ్ ఈ ఓ బలుగూరి సమ్మయ్య, ఎం ఎల్ హెచ్ పి లు రవళి, ఆసియా, ఏఎన్ఎంలు గంగా, రాజేశ్వరి, ఎల్లారీశ్వరి, చంద్రకళ, నవలోక, హెల్త్ అసిస్టెంట్ మొగిలిపెల్లి ముత్తయ్య, ఆశాలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.