రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..

నవతెలంగాణ-అమరావతి: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన కంటైనర్, డివైడర్ దాటి కారు, మెడికల్ వ్యాన్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనాస్థలిలో ఇద్దరు, ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు విడిచారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్టు సమాచారం. కారు కొవ్వూరు నుంచి ఏలూరు వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. అతివేగమే ఈప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love