లోయలో పడిన వాహనం..ఆరుగురు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డంగుదురు పవర్‌ ప్రాజెక్ట్‌కు చెందిన 10 మంది కార్మికులు క్రూజర్‌ వాహనంలో వెళ్తున్నారు. డంగుదురు డ్యామ్‌ సైట్‌ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కిష్త్వార్‌లో లోతైన లోయలోకి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయడినట్లు కిష్త్వార్‌ పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) సమీపంలోని కేరి సెక్టార్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Spread the love