రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై సీఎం కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డా.బీఆర్ అంబెడ్కర్ సచివాలయంలోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 2న సచివాలయం ప్రధాన ప్రాంగణంలో వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్‌. ఈ మేరకు ఈ వేడుకల్లో 2 వేల మంది పాల్గొనే అవకాశం అందుకు కావాల్సిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం చేశారు జిఎడి సెక్రటరీ. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల పై జిఎడి సెక్రటరీ రివ్యూ నిర్వహించారు. ఇందులో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Spread the love