రోహిత్ వేముల కేసును పునర్విచారణను స్వాగతిస్తున్నాము: ఎస్ఎఫ్ఐ

– రోహిత్ కులం గురించి కాకుండా బండారు దత్తాత్రేయ,
– రామచంద్రరావు, నాటి వి.సి. అప్పారావు, ఎబివిపి హారస్మెంట్ పై విచారణ జరపాలి

– పోలీసు విచారణ రిపోర్ట్, బిజెపి స్క్రిప్ట్ లాగా ఉంది
– రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలి
నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీ విద్యార్ధి ,నాటి బిజెపి లీడర్లు, వి.సి. హారస్మెంట్ వల్లన ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విద్యార్ధి రోహిత్ వేముల తను కులం గురించి అబద్ధం చెప్పాడని అందుకే భయపడి చనిపోయాడని 60 పేజీలు రిపోర్ట్ కోర్టుకు సమర్పించారు. దానిలో పోలీసులు రోహిత్ ఆత్మహత్య కారణం ఎమిటి?,తను ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో తను రాసిన లెటర్ లో వివక్ష గురించి మాట్లాడి యూనివర్శీటీ గురించి రాసిన అంశాలపై విచారణ జరపకుండా పోలీసులు రోహిత్ వేముల కులం ఎమిటి? కులం కాదు కాబట్టి భయపడి చనిపోయాడని తెలపడం అత్యంత దుర్మార్గపు చర్య, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, వి.సి. పొదిల అప్పారావు, ఎబివిపి లీడర్ల నన్ను మానసికంగా హింసించడం, రస్టీకేట్ చేయించడం చేశారని రోహిత్ వేముల చెప్పి వివక్ష వ్యతిరేకంగా,తనను యూనివర్శీటీ నుండి వెలివేయడాని నిరసనగా వెలివాడ ఎర్పాటు చేసుకోని మరి నిరసన చేయలేదా? మరి కులం కాదు కాబట్టి భయపడి ఎలా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ రిపోర్ట్ అంతా బీజేపీ స్క్రిప్ట్ రిపోర్ట్ లాగానే ఉందని రాష్ట్ర కమిటీ విమర్శించింది. తెలంగాణ రాష్ట్ర పోలీసు కేసు రీ-ఓపెన్ చేయడానికి ఆదేశించడం, హైకోర్టులో రిట్ వేయడాని స్వాగతిస్తున్నామని ఇది రాజకీయ అంశంగా కాకుండా రోహిత్ వేములకు న్యాయం చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలని కోరారు. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. యూనివర్శీటీలో రోహిత్ లాగా ఆత్మహత్యలు చేసుకోకుండా మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా రోహిత్ చట్టాన్ని తీసుకుని రావాలని డిమాండ్ చేస్తోంది.

Spread the love