ఓట్ల వేటకు ఎండ దెబ్బ.?

– ఎన్నికల ప్రచారంపై భానుడి ప్రతాపం
– ఉదయం సాయంత్రం వెళల్లోనే ప్రచారం
– సభలు, సమావేశాలకే పరిమితమైన అభ్యర్థులు
నవతెలంగాణ- మల్హర్ రావు
లోకసభ ఎన్నికల వేడి మొదలైంది. పోలింగ్ కు మరో తొమ్మిది రోజులు గడువు ఉండగా అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గేలుపొందేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.అయితే ఆయా పార్టీల అభ్యర్థులు చేస్తున్న ఓట్ల వేటపై భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు.ఉదయం 10 గంటలు దాటితే ఎండ భగ్గుమంటుంది. సాయంత్రం 5 గంటలైన ఎండ తీవ్రత తగ్గడం లేదు. రెండు రోజుల నుంచి జిల్లా రేడ్జోన్ కు వెళ్లడంతో అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు ప్రచారానికి బయటకు వెళ్ళేందుకు జంకుతున్నారు.
ఇంటింటికి వెళ్ళేందుకు ఆపసోపాలు..
పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ సిటు గెలిసేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,బిఆర్ఎస్,బిజెపిలకు చావోరేవుగా మారింది.ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో ప్రధాన పార్టీలున్నాయి. రాష్ట్రంలో అధికారం చేజారడంతో..  లెక్కలను సరిచేసేందుకు ఎలాగైనా పెద్దపల్లి స్థానాన్ని గెలువలన్నా కషితో బిఆర్ఎస్ పని చేస్తోంది.ప్రధాని మోదీ మ్యాజిక్ తో  ఖాతా తెరవాలని బిజేపీ భావిస్తోంది.ఆరు గ్యారంటీతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఐదు గ్యారెంటీలపై అవగాన కల్పిస్తూ విజయం వైపు కాంగ్రెస్ దూసుకెళ్ళుతొంది.
ఎండలో తిరిగేoదుకు ఆసక్తి చూపని కేడర్..
ప్రస్తుతం ఓటర్లను నేరుగా కలిసి ప్రసన్నం చేసుకుంటేనే గాని ఓట్లు రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రతి ఓటరును కలుసుకోవడం అభ్యర్థులకు సాద్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తమ గుర్తునైనా ప్రజల వద్దకు చేర్చాలనే ఉద్దేశ్యంతో అభ్యర్థులు ఉన్నట్లుగా  తెలుస్తోంది. ఇందుకోసం తమ పార్టీకి సంబంధించిన ద్వితీయ శ్రేణి, ఆకింది స్థాయి నాయకత్వానికి దిశానిర్దేశం చేసేందుకు మండలాల వారిగా ప్రధాన పార్టీలు సమావేశాలు,సభలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇక ఇతర ప్రచార రథాలతో గల్లిగల్లిలా తిరిగేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారం పదిరోజులుగా జిల్లాలో భానుడు భగ్గుమనడం, మరి రెండుమూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు నమోదవడంతో  ఎండలో తిరిగేoదుకు కేడర్ అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో జోష్ కనిపిచడం లేదు. మరో నాలుగైదు రోజులపాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుండడం, ప్రచార గడువు దగ్గర పడడంతో ప్రధాన పార్టీలల్లో ఆందోళన నెలకొంది.
Spread the love