జాతర పనులను జనవరి చివరిలోపు పూర్తి చేయాలి: సీతక్క  

– రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క 
– మేడారం జాతర పనులు పరిశీలించిన మంత్రి నూతన ప్రభుత్వం మహా జాతరకు ఆర్థిక సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది
నవతెలంగాణ -తాడ్వాయి 
మేడారం మహా జాతర అభివృద్ధి పనులు జనవరి చివరిలోగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క అన్నారు. శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం శ్రీ సమ్మక్క సారమ్మ దేవత లను రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా అధికారులు పనులు పూర్తి చేయాలని శాఖ అధికారులకు సూచించారు.అనంతరం మంత్రి అనసూయ సీతక్క పాత్రికేయుల సమావేశం లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నూతన ప్రభుత్వం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహా జాతరకు ఆర్థిక సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 75 కోట్ల రూపాయలను కేటాయించిందని అదనంగా  నిధుల కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని వాటిని చెల్లించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించే శ్రీ మేడారం సమ్మక్క జాతరను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకోవడం జరుగుతుంది ఏర్పడ్డాక మొదటిసారిగా జాతర నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ జాతరను అత్యంత అంగరంగ వైభవంగా జరపాలని జాతర విశిష్టతను ప్రపంచం నలుమూలల తెలియజేయాలని మంత్రి అన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని ఇటీవల కాలంలో భారత దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి గారిని కూడా కొరకు జాతీయ హోదా కల్పించాలని కోరడం జరిగిందని ఈసారి జాతీయ హోదా కల్పించడం జరుగుతుందని  ఆశిస్తున్నానని సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు.
       జాతీయ పండగ హోదా లభిస్తే దేశవ్యాప్తంగా జాతరకు మరింత ఆదరణ లభిస్తుందని ఇప్పటికే చాలామంది జాతర జరిగే ప్రధాన నాలుగు రోజులలోనే అమ్మవార్లను దర్శించుకోవాలని చూస్తూ ఉంటారు కానీ సమాచార లోపం వల్ల భక్తులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా జాతర జరిగే ప్రధాన నాలుగు తేదీలను అందరికీ తెలియజేసే విధంగా విస్తృత ప్రకారం చేయాలని కోరారు. అధికారులు సూచిక బోర్డులను  ఏర్పాట్లు  చేయాలని అన్నారు.. దేశం లో ఎక్కడ లేనటువంటి విధంగా గా ఫ్రీ గా దేవతలను  దర్శనం చేసుకునే అవకాశం  కేవలం మేడారం లోనే ఉంటుందనీ  అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు జాతర సమయంలో అనేక వ్యర్ధాలను ఇష్టం వచ్చిన రీతిలో పరేస్తున్నారు కానీ జాతర అనంతరం సమీప గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  కాబట్టి జాతరకు వచ్చే భక్తులు పరిశుభ్రంగా ఉంచే విధంగా చూడాలని ప్లాస్టిక్, సీసాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఒక చోట పడేయాలని  భక్తులకు  సూచించారు.మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో జాతర సంబంధించిన పనులు జనవరి నెల చివరిలోపు పూర్తిచేయాలని పనుల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే పనులు చేయని అధికారులను ఇంటికి పంపించడం జరుగుతుందని మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శబరిష్ , ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అంకిత్, అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) శ్రీజ , అదనపు కలెక్టర్ ( రెవెన్యూ) వేణు గోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Spread the love