సాయిచంద్ మృతి తీరని లోటు..


– బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య
నవతెలంగాణ- తాడ్వాయి
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని తాడ్వాయి మండల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లయ్య అన్నారు. గురువారం ఉద్యమ నాయకుడు, గాయకుడు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి తన పాటలతో ప్రజల్లో చైతన్యం, పార్టీ నేతల్లో పోరాట స్ఫూర్తిని కదిలిస్తూ వచ్చిన సాయిచంద్ మరణం యావత్ తెలంగాణకే  తీరని లోటు  అన్నారు. కాగా మండలంలోని ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీల నాయకులు కళాకారులు సాయి చందు మృతికి సంతాపం తెలియజేశారు.
Spread the love