నిద్రమాత్రలు మింగి మరోసారి ఆత్మహత్యాయత్నం చేసిన శేజల్

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసిన ఆరిజిన్ డెయిరీ ఎండీ శేజల్ గతంలో ఓసారి ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆత్మహత్యకు యత్నించడం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని పెద్దమ్మ గుడి వద్ద రహదారిపై శేజల్ అపస్మారకస్థితిలో ఉండగా శేజల్  గుర్తించారు. ఈ రోజు తోలి ఏకాదశి పండుగ కావడంతో శేజల్ పెద్దమ్మ గుడికి వచ్చినట్టు భావిస్తున్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఇంకా చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం జరగలేదని శేజల్ మనస్తాపం చెందినట్టుగా భావిస్తున్నారు. ఆమె వద్ద లభించిన హ్యాండ్ బ్యాగులో నిద్రమాత్రలు కనిపించాయి. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పి ఫోన్ కట్ చేసినట్టు తెలిసింది. కాగా, అపస్మారక స్థితిలో ఉన్న శేజల్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. శేజల్… ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐ, మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Spread the love