మసకబారిన మామిడి రైతుల బతుకులు

నవతెలంగాణ – గోవిందరావుపేట
అకాల వర్షాల పుణ్యమా అని మామిడి రైతుల బతుకులు మసక బారినవని రైతులు తెలుపుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారు రెండువేల ఎకరాల పైబడి  రైతులు మామిడి తోటలను సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం మా బిడి కాపు అధికంగా కనబడడంతో రైతులు తోటలు పట్టినవారు సంతోషంతో గంతులు వేశారు. మందులను కూడా మంచిగానే స్ప్రే చేశారు. తెగుళ్లు సుడిదోమ ల నుండి తట్టుకునేందుకు వ్యవసాయ అధికారుల సూచనలను పాటిస్తూ వచ్చారు. కాయ తయారయింది ఒకటి రెండు పర్యాయములు కొంతమంది మార్కెట్కు కూడా వెళ్లారు మంచి ధర పలికిందని కాయ ఇంకా పాకానికి వస్తే మంచి రేటు ఉంటుందని ఎదురు చూస్తున్న తరుణంలో అకాల వర్షాలు రైతుల పాలిట యమపాశం గా తయారయ్యాయి. తుఫాన్లు అల్పపీడనాలు తో వరుస పెట్టి రెండు పర్యాయములు వర్షాలు కొరియడంతో కాయలు నల్లబడి పురుగుచేరి నాణ్యత దెబ్బతింది. కింది నుంచి చెట్టు వైపు చూస్తే మంచిగానే కనిపిస్తున్న కాయ తొడిమ వద్ద మాత్రం నల్లబడి క్వాలిటీ లేకుండా పోయింది. కాయలు కోసిచూసినా కూడా పురుగు రావడం తింటానికి అవకాశం లేకుండా ఉండడంతో రైతులు తోటలు పట్టిన గుత్తేదారులు లబోదిబోమంటున్నారు. మండలంలోని చల్వాయి గ్రామంలోని జిల్లెల్ల గడ్డ ప్రాంతంలో శేషులు మురళిలకు సంబంధించిన తోటలను పట్టిన గుత్తేదారు కోయకుండానే తోటలను వదిలివేయడం జరిగింది. నాణ్యత లేకపోవడం వల్ల కోసిన కూళ్లు ట్రాన్స్పోర్ట్ నెత్తిన పడతాయి అన్న ఉద్దేశంతో తోటలను వదిలేసినట్లు తోటమాలి చెబుతున్నాడు. కాపు అధికంగా ఉన్న పనికిరాకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం కాపు తక్కువగా ఉన్న ధర ఉండటంతో లాభాలు వచ్చిన మాట వాస్తవమేనని రైతులు గుత్తేదారులు అంగీకరిస్తున్నారు. ఈసారి ఇలా అవుతుందని ఊహించలేకపోయామని అంటున్నారు కేవలం వర్షాల వల్లే ఇలా జరిగిందని ఇప్పుడు చేసేదేమీ లేక తోటలను వదిలేస్తున్నామని అంటున్నారు.
20 లక్షలు పెట్టుబడి పెడితే రెండు లక్షల కూడా చేతికి రాలేదు. మమ్మద్ మాశుక్ గోవిందరావుపేట.
ఈ సంవత్సరము 20 లక్షలతో తోటలు పట్టడం జరిగింది. తోటలు పూత దశ నుండి మందులను పిచికారి చేయడం నాటి నుండి నేటి వరకు కాపలా కూలీలను నియమించడం మొదలుకొని ఇప్పటివరకు పాతిక లక్షలకు ఖర్చు వచ్చింది. ఈ సంవత్సరం మొదటి దఫా కాయలు విక్రయించినప్పుడు రెండు మూడు లక్షలు చేతికి వచ్చాయి. ఎంతో ధర పలుకుతుందన్న బనగనపల్లి రకం మామిడి నాణ్యత లేకుండా పోయింది. మార్కెట్కు తోలిన తర్వాత కూడా డబ్బులు ఇచ్చేందుకు వ్యాపారులు తిరకాసు పెడుతున్నారు. నాణ్యత లేదని కాయ మచ్చ వచ్చిందని లోపల పురుగు వచ్చిందని లోపల కూడా నలుపు వచ్చిందని రకరకాల కారణాలతో డబ్బులు ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదని గట్టిగా అడిగే పరిస్థితులు కూడా లేవు. ఇలాంటి పరిస్థితులు పగవాడికి కూడా రావద్దు. ప్రభుత్వం ఇప్పటికైనా మామిడి రైతుల బాధలను గుర్తించి కోయని కాయలను సర్వే చేసి ఫలితం ఇప్పించాలని కోరుకుంటున్నాను.
Spread the love