బీఎస్ పి పార్టీ అర్బన్ కమిటీని తొలగించే అధికారం జిల్లా కమిటీకి లేదు

ప్రజల్లో నీరడి లక్ష్మణ్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక నిందలు
నవతెలంగాణ –  కంటేశ్వర్
ప్రజలలో నీరడి లక్ష్మణ్ కు పెరుగుతున్న ఆదరణ, అభిమానం ప్రజల్లో మమేకం కావడం చూసి ఓర్వలేక అర్బన్ కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందని బి ఎస్ పి పార్టీ అర్బన్ ఇన్చార్జి నీరడీ లక్ష్మణ్ తొలగించడం జరిగిందని, అర్బన్ కమిటీని రద్దు చేసే అధికారం జిల్లా కమిటీకి లేదని అన్నారు. రాష్ట్ర కమిటీకి ఉన్నప్పటికీ రాష్ట్ర కమిటీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించలేదని అన్నారు. ఈ మేరకు బుధవారం ద్వారాకనగర్ అర్బన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కమిటీలు ఏర్పడ్డాయని, పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మాత్రమే పని చేస్తున్నామని అన్నారు. పార్టీ పేరును,పార్టీ  ప్రతిష్ట కు ఎక్కడ భంగం కలిగించలేదని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మాట్లాడడం జరిగిందని వారు అర్బన్ లో పార్టీ బలోపేతానికి పనిచేయాలని  సూచించారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహతి రమేష్ తో కూడా మాట్లాడామని అర్బన్ కమిటీని రద్దు చేసే అధికారం జిల్లా కమిటీకి హక్కు లేదని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు వాట్సప్ ద్వారా సందేశం పంపించారని అయినప్పటికీ వారు ఖాతరు చేయడం లేదని, పార్టీ బలోపేతం కోసం నాతో పోటీ పడాలి తప్ప ఇలా నిలాప నిందలు వేయడం సరికాదన్నారు. పార్టీ నిర్మాణానికి తోడ్పడాలి తప్ప ఇలా పార్టీ కోసం పని చేస్తున్న మా లాంటి వారిపై కుట్రలు మానుకోవాలని అన్నారు.పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లి వివిధ పార్టీలతో పోటీ పడుతూ ముందుకెళ్లాలి తప్ప, పార్టీ విధివిధానాలు తుంగలో తొక్కేలా చూడటం సరి కాదన్నారు.నిరాదారమైన మాటలను పరిగణలోకి తీసుకోమని ఇంకా రెట్టింపు ఉత్సహంతో పని చేసి రానున్న రోజుల్లో బీ ఎస్ పి పార్టీ జండాను అర్బన్ లో ఎగరవేయడం కోసం కృషి చేస్తామన్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడం కోసం, అర్బన్ లో అర్బన్ నియోజకవర్గన్ని బీఎస్పీ ఖాతాలో వేయడం కోసం నిరంతర కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో షకీల్ అహ్మద్, సిహెచ్ రాజశేఖర్ పాల్గొన్నారు.
Spread the love