నవతెలంగాణ – కంటేశ్వర్
జగిత్యాల్ నందు రోటరీ క్లబ్ నిజామాబాద్ సభ్యులు మర్యాదపూర్వకంగా జగిత్యాల శాసనసభ సభ్యులు రోటరీ సభ్యులు డాక్టర్ బండి సంజయ్ ని మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈనెల 21వ తేదీ న ప్రారంభించ బోయే గిరిజా కంటి వైద్యశాల కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగినది. ఇదే సందర్భంలో రోటరీ కార్యాలయానికి కూడా సందర్షిoచనున్నరు. ఈ కార్యక్రమంలో రోటరీ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి డాక్టర్. విశాల్ ఆకుల, మాజీ అధ్యక్షులు డాక్టర్ పి బి. కృష్ణమూర్తి, ఆర్. జగదిశ్వేర్ రావు, వి. శ్రీనివాస్ రావ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ మాట్లాడుతూ.. రోటరీ యెనలేని సేవలు చేస్తూ ముందుకూ వెళ్తున్నది. ప్రభుత్వం, స్వచంద సంస్థల సహకారముతో ప్రజలకి సేవా చేయటం గొప్ప అనుభూతి అనీ అన్నారు.