ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ కుట్టడం ద్వారా ఈ డెంగ్యూ వ్యాధి…

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ కుట్టడం ద్వారా ఈ డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుందని,ఈ దోమలు పగటిపూట మాత్రమే కుడతాయని, డెంగ్యూ వ్యాధికి చికిత్స లేదని, నివారణ ఒక్కటే మార్గమని ఇందల్ వాయి మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ పాల్గొని మాట్లాడుతూ ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ కుట్టడం ద్వారా ఈ డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ దోమలు పగటిపూట మాత్రమే కుడతాయని తెలిపారు. డెంగ్యూ వ్యాధికి చికిత్స లేదని నివారణ ఒక్కటే మార్గమని ఆయన ప్రజలకు సూచించారు.
 డెంగ్యూ వ్యాధి లక్షణాలు:
తీవ్రమైన తలనొప్పి,తీవ్రమైన జ్వరం, శరీరంపై దద్దుర్లు,చర్మం ద్వారా రక్తస్రావము, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, ఆకలి మందగించుట, డెంగ్యూ వ్యాధిని” ఎలిసా” పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చని అయన పేర్కొన్నారు.డెంగ్యూ వ్యాధి  నిర్మూలనకు ప్రజలు పూర్తిస్థాయిలో తమ వంతు బాధ్యత నెరవేర్చాలని వివరించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని  అమలు చేయడం ద్వారా ఈ తొట్టిలలో పూలకుండీల్లో నిలువగల నీరు పూర్తిస్థాయిలో తొలగించాలని సూచించారు. మంచినీరు నిలువగల ప్రదేశాలలో ఈ దోమ పెరుగుతుందని కాబట్టి మంచినీరు నిలువ ఉండేటువంటి పారేసిన కొబ్బరి చిప్పలలో, పాత టైర్లలో,పూల కుండీలలో, వాడని కూలర్లలో, నీరు నిల్వ ఉంటుందని పేర్కొన్నారు. దోమలు పుట్టకుండా కుట్టకుండా జాగ్రత్త పడదాం ప్రజల భాగస్వామ్యం పద్ధతులు డెంగ్యూ నిర్మూలిద్దామని, వాటిలో దోమలు పెరిగే అవకాశం అధికంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవత, డాక్టర్ వరలక్ష్మి,డాక్టర్ మానస, పబ్లిక్ హెల్త్ నర్స్ ఎలిజిబెత్, సూపర్వైజర్  ఉమారాణి , మహేష్, మణితేజ ఆరోగ్య కార్యకర్తలు సంతోషి,స్వర్ణ, సుజాత,దేవిమేరీ, సాయి వీర కుమారి, భానుప్రియ, స్టాఫ్ నర్స్ సునీత, ల్యాబ్ టెక్నీషియన్ అనిత, గంగుబాయి, రాధిక,లేయ ఆశా కార్యకర్తలు పద్మ,పాశం జ్యోతి, బండ ప్రమీల, సుప్రియ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love