మహిళల ట్రైనింగ్ సెంటర్లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

నవతెలంగాణ – కంటేశ్వర్
జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల సరస్వతి ఎంపీహెచ్ డబ్ల్యూ మహిళల ట్రైనింగ్ సెంటర్ లో ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా నర్సింగ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సులోచన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం నర్సుల చేతిలోనే ఉంటుందని నర్సులు చేసేది సేవ అని కొనియాడారు. మదర్ తెరిసాను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది నర్సులు సేవలను అందిస్తున్నారని అలాంటి సేవలను మీరు కూడా అందించాలని ఈ సందర్భంగా కొంత మందిని ఉదాహరణలుగా తీసుకొని వివరించారు. నర్సులు దేవుళ్ళతో సమానం ఎందుకంటే ఓపిక సహనము ఓర్పుతో ఆసుపత్రిలో చేరినప్పుడు చికిత్స అందించినప్పుడు చికిత్స పొందుతున్న వ్యక్తి ఎంత ఆనందపడతాడో చికిత్స అందించినందుకు కూడా ఒక నర్సు అంతే ఆనందపడుతుందని సేవ భావం ప్రతి ఒక్కరిలో అలవర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా నర్సింగ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సులోచన ను సరస్వతి ఎం పి హెచ్ డబ్ల్యు మహిళల  ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నందు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ రమేష్ గౌడ్ ప్రిన్సిపాల్ మహేష్ కుమార్, మాల శ్రీ, ప్రియాంకాలతో పాటు నర్సులు తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love